ShyamSinghaRoy :”శ్యామ్ సింగరాయ్” నుంచి ఓ బిగ్ అప్డేట్.. సిరివెన్నెల చివరి పాట విడుదల

-

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం శామ్ సింగరాయి. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు నాని. అయితే ఈ సినిమా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, మృతి శక్తి మరియు మడోన్నా సెబాస్టియన్ లు ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాటను విడుదల చేసింది చిత్ర బృందం. “నెలరాజుని ఇలా రా నీ కలిపింది కదా సిరివెన్నెల ” అంటూ సాగే ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో సిరివెన్నెల సీతారామశాస్త్రి.. తనదైన ముద్రను వేసుకున్నారు. అలాగే ఈ సాంగ్ లో హీరో నాని అలాగే సాయి పల్లవి మధ్య కోఆర్డినేషన్ చాలా వర్క్ అవుట్ అయింది. అటు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన లిరిక్స్ కూడా చాలా వినసొంపుగా ఉన్నాయి. మొత్తానికి ఈ పాట సినిమాపై హైప్ ను పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version