భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే అర్చకులు సీతాసమేత శ్రీరాముల వారికి విశేష పూజలు అందించారు. భద్రాచలం సన్నిధానం మొత్తం జై రామ్ నినాదాలతో మారుమోగింది. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్దఎత్తున భక్తులు భద్రాద్రికి చేరుకున్నారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆలయానికి చేరుకుని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు కన్నుల పండుగగా జరపగా.. భక్తులు మురిసిపోయారు. కళ్యాణ మహోత్సవం అనంతరం సీఎం రేవంత్ దంపతులు, మంత్రులకు వేద పండితులు ముత్యాల తలంబ్రాలు అందజేశారు.
https://twitter.com/ChotaNewsApp/status/1908783976677855257