గ్రామాల వాట్సాప్ గ్రూపులపై పోలీసుల నిఘా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే అంతే!

-

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు, పోస్టులు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వ యంత్రాంగం వాటి మీద నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు గ్రామాల్లోని వాట్సాప్ అడ్మిన్లను అడిగి మరి గ్రూపుల్లో జాయిన్ అవుతున్నట్లు సమాచారం.

ఈ మేరకు గ్రూపుల్లో యాడ్ అయిన పోలీసు కానిస్టేబుళ్లు గ్రూపులోని పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచుకుతున్నట్లు తెలిసింది. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూపుల్లో ఏదైనా షేర్ చేస్తే వెంటనే అరెస్ట్ చేయాలని వారికి ఆదేశాలు అందినట్లు సమాచారం.గ్రామాల నుంచి ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే వారిని పోలీసులు గ్రూపుల వివరాలు అడుగుతున్నట్లు టాక్.

పార్టీల గ్రూపులు, ఊరి అభివృద్ధి గ్రూపులు, కులాల వారీగా, మతాల వారీగా, యూత్‌ గ్రూపులు, ఇంటిపేర్లతో ఉన్న గ్రూపులు, దావత్‌ల గ్రూపులు ఇలా అన్ని గ్రూపుల్లో జాయిన్ చేయాలని పోలీసులు వారిని బతిమాలుతున్నట్లు తెలిసింది. తెలంగాణలో మొత్తం 3 లక్షల గ్రూపుల్లో జాయిన్ అవ్వాలని పోలీసులు టార్గెట్‌ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news