శ్రీరామనవమి శోభాయాత్ర.. ఆ దారిలో భారీగా పోలీస్ బందోబస్తు

-

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మంగళ్‌హాట్ ప్రాంతంలోని సీతారాం భాగ్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. మొత్తం 3.8 కి.మీ. మేర కొనసాగున్న శోభాయాత్ర సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకోనుంది.

శోభాయాత్రకు వేలల్లో రామ భక్తులు వస్తున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు.దాదాపు 20 వేల మంది విధుల్లో ఉన్నారు.అందులో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ‌ఆర్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ బృందాలు సైతం యాత్రలో ఉండనున్నాయి. సీసీ కెమెరాను శోభాయాత్ ప్రారంభయ్యే ప్రాంతంలో ఫిక్స్ చేసి వాటిని బంజారా‌హిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. దీంతో ర్యాలీని అక్కడి నుంచే మానిటరింగ్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news