అతను పద్మ పురస్కారానికి అర్హుడు అంటున్న నెటిజన్స్…!

-

అదో దట్టమైన అడవి… అందులో క్రూర మృగాళ్ల దాడి కూడా ఎక్కువే. అలాంటి అడవిగుండా ఏకంగా 30 సంవత్సరాలుగా ఓ పోస్ట్ మాన్ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాలకు తన సేవలను అందిస్తున్నారు. ఆ వ్యక్తి పేరు శివన్. ఈయన తమిళనాడులో 30 సంవత్సరాలుగా పోస్ట్ మ్యాన్ ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ 30 సంవత్సరాలు ఆయన పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు ఉత్తరాలు చేరవేస్తున్నారు. దట్టమైన అడవి, రాళ్లు రప్పలు, జలపాతాలు దాటుకుంటూ ఏకంగా 15 మైళ్ళు దూరం నడుస్తూ తన సేవలను ప్రజలకు చేరవేశాడు.

sivan

అయితే ఈయన విధినిర్వహణలో కొన్ని క్రూర మృగాల నుండి కూడా దాడులను ఎదుర్కొన్నాడు. ఇకపోతే కొద్దిరోజుల్లో ఈయన పదవీ విరమణ చేయబోతున్నారు. అయితే ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ మహిళ ఐఏఎస్ అధికారి సుప్రియ సాహూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు తెలియ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ భారత్ లో ట్రేండింగ్ గా మారింది. నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన శివన్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఆయనకి పదవి విరమణ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. మరికొందరు అతడు పద్మ పురస్కారానికి అర్హుడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Postman D. Sivan walked 15 kms everyday through thick forests to deliver mail in inaccessible areas in Coonoor.Chased by wild elephants,bears, gaurs,crossing slippery streams&amp;waterfalls he did his duty with utmost dedication for 30 years till he retired last week-Dinamalar,Hindu <a href=”https://t.co/YY1fIoB2jj”>pic.twitter.com/YY1fIoB2jj</a></p>&mdash; Supriya Sahu IAS (@supriyasahuias) <a href=”https://twitter.com/supriyasahuias/status/1280745546202755073?ref_src=twsrc%5Etfw”>July 8, 2020</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

 

Read more RELATED
Recommended to you

Exit mobile version