సినిమా ఆడాలి అంటూ ఏడ్చేసిన శివాత్మిక రాజశేఖర్..!!

-

నటుడు రాజశేఖర్ జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక రాజశేఖర్ మొదట దొరసాని సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది. మొదటి చిత్రంతో బాగానే ఆకట్టుకున్న సక్సెస్ మాత్రం కాలేకపోయింది. అటు తర్వాత తమిళంలో పలు సినిమాలలో నటించింది.అక్కడ కూడా మెప్పించలేకపోయింది. ఇప్పటివరకు శివాత్మిక తనను తాను నిరూపించుకోవడానికి సరైన అవకాశం పూర్తిస్థాయిలో దక్కలేదు.ఇప్పుడు తాజాగా పంచతంత్రం అనే ఒక సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది శివాత్మిక.

ముఖ్యంగా ఇందులో బ్రహ్మానందం ,కలర్ స్వాతి ,రాహుల్ విజయ్,సముద్రఖని,శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య ద్రిస్ట, వికాస్ ముప్పల తదితరులు ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. మొత్తం ఐదుగురి కథల అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.నిన్నటి రోజున ఈ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హరిశంకర్, జీవిత రాజశేఖర్ అతిధులుగా వచ్చారు. ఈ సందర్భంగా శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ ఎప్పటిలాగానే ఎమోషనల్ అవ్వడం జరిగింది.

అఖిలేష్ ఈ సినిమా మీ వల్లే మీకోసమే చేశాను.. తను చేస్తావా అని కూడా అడగలేదు అందుకు థాంక్యూ.. నన్ను అంతగా నమ్మినందుకు నేను ఈ సినిమాలో నటించడానికి మరొక కారణం కూడా ఉన్నది ఉష ఆమెకు కూడా థాంక్యూ అంటూ తెలియజేసింది. హర్ష కథ చెప్పినప్పుడు రాసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఇప్పటికీ కూడా లేఖ పాత్రకు న్యాయం చేశానని నమ్మకం అయితే తనకు రాలేదని తెలియజేస్తోంది.

తనని నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు హర్షకు థాంక్యూ తెలియజేసింది శివాత్మిక రాజశేఖర్. ఈ చిత్రంతో దర్శకుడు హర్ష అత్యున్నత స్థాయికి చేరుకోవాలని శివాత్మిక మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ఈ సినిమాకు సంబంధించి టీం మొత్తం తనకు ఫ్రెండ్స్ అయ్యారని ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ రావాలని కోరుకుంటున్నానని తెలియజేసింది. మళ్లీ ఇంతమంది ఫ్రెండ్స్ తో సినిమా చేయగలుగుతానో లేదో తనకు తెలియదంటూ థాంక్యూ రాజ్ అంటూ ఎమోషనల్ అయ్యింది శివాత్మిక. తన కెరియర్ లో బ్రహ్మానందం స్వాతి గారితో సినిమా చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.. స్వాతి గారు ఫోన్ చేసి నువ్వు బాగా చేశావని చెబుతూ ఉంటారని తెలియజేసింది. ఈ సినిమాతో మీరు గెలిస్తే నేను గెలిచినట్టే అందుకే ఈ సినిమా ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాను అంటూ శివాత్మిక ఎమోషనల్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version