కరోనా నుండి రికవరీ అయ్యాక చర్మానికి ఏమవుతుంది? కరోనా రికవరీ అయ్యాక అరుదుగా వచ్చే సమస్యల్లో చర్మ సమస్యలు కూడా ఉంటాయా అంటే అవుననే చెప్పాలి. చర్మ కణాల్లో నీరు తగ్గిపోవడం వలన పాలిపోయినట్టుగా, ముడతలు పడ్డట్టుగా, కఠినంగా కనిపిస్తుంది. అదీగాక ఆల్రెడీ మొటిమలు, నల్లమచ్చలు, సొరియాసిస్ వంటి ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల కరోనా నుండి రికవరీ అయ్యాక చర్మ సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఐతే ఈ విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదు. విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సి, విటమిన్ ఈ గల ఆహారాలను తీసుకోవాలి. సప్లిమెంట్స్ తీసుకున్నా బాగుంటుంది. ఒమెగా 3కొవ్వు ఆమ్లాలు, పసుపు తీసుకోవడం చర్మానికి మేలు చేస్తుంది. ఇంకా రోజులో 3.5- 4లీటర్ల నీళ్ళు తాగాలి. ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అదే సమయంలో జంక్ ఫుడ్, చక్కెర, బెల్లం, ఖర్జూరం మొదలగు వాటిని ముట్టుకోకూడదు.
యోగా, ప్రాణాయామం మరీ బాగుంటుంది. కావాల్సినంత సమయం నిద్రపోవడం నేర్చుకోండి. చర్మ సంరక్షణ కోసం విటమిన్ సి ఉన్న క్లీనర్లని ఉపయోగించాలి. అలాగే, విటమిన్ సి కలిగి ఉన్న సన్న్ స్క్రీన్ లోషన్ ని వాడాలి. మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే హైడ్రాక్సీ సీరమ్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రొటీన్ ని వారానికి 2-3సార్లు వాడితే చక్కని ఫలితం ఇస్తుంది. కోవిడ్ నుండి రికవరీ అయ్యాక వచ్చే చర్మ సమస్యలను పోగొట్టుకోవడానికి పైన చెప్పిన విషయాలను మీ రోజువారి డైట్ లో చేర్చుకోండి.