రాష్ట్రంలో ఎస్ఎల్‌బీసీ ప్రమాదం సంభవించి నేటితో 50 రోజులు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు ఈ ఘటనపై రేవంత్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీసి చేతులు దులుపుకున్నారని, మిగతా ఆరుగురి జాడ ఎప్పుడు కనుక్కుంటారని ప్రశ్నించారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, వాస్తవాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక మంత్రులకు హెలికాప్టర్‌లో తిరగడం తప్పా..బాధితుల కుటుంబాలకు ధైర్యం చెప్పే సమయం కూడా వారికి లేకుండా పోయిందని తీవ్ర విమర్శలు చేశారు.