బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకిల్‌ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.ఆదివారం ఉదయం ఆయన ఇంటికి కవిత తన భర్తత అనిల్ కుమార్‌తో కలిసి వెళ్లారు.ఇటీవల అనారోగ్యంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ తల్లి కన్నుమూసిన విషయం తెలిసిందే.ఆ టైంలో షకిల్‌ను కవిత కలవలేకపోయారు.తాజాగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన ఆమె.. షకిల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని అందజేశారు.
కాగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎంపీగా పనిచేసిన కవిత గతంలో ఎంపీ అర్వింద్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండోసారి పోటీ చేయలేకపోయారు. అప్పుడు ఆమె జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ కేడర్‌తో ఆమె నేటికీ టచ్‌లోనే ఉన్నారు.