తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ రవి పెండింగులో పెట్టడంపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్రంగా తప్పుపట్డంతో పాటు ఆయన్ను మందలించిన విషయం తెలిసిందే. గవర్నర్ నుంచి ఆమోదం నెల రోజుల్లో రాకపోతే అవి ఆమోదం పొందినట్లే పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఫాలో అవుతూ గవర్నర్ ఆమోదం లేకుండానే 10 బిల్లులకు సంబంధించి గెజిట్‌ను స్టాలిన్ సర్కార్ ప్రకటించింది.కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం ఇక నుంచి తమిళనాడులోని అన్ని విశ్వవిద్యాలయాలకు చాన్సలర్ గా ముఖ్యమంత్రే వ్యవహరించనున్నారు.