ఆఫీస్ లలో ఎక్కువగా వర్క్ మీద ఫోకస్ చెయ్యాలి..కాసేపు ముచ్చటలు పెట్టుకున్నా కూడా పైవారు ఊరుకోరు. అలాంటిది నిద్రపోయే జాబ్ దొరికితే ఎవరూ మాత్రం కాదంటారు..అలాంటి జాబ్ ఒకటి ఉందనే సందేహం చాలా మందికి రావొచ్చు.. ఆ జాబ్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఓ పరుపుల కంపెనీ స్లీపింగ్ జాబ్స్ కు నోటిఫికేషన్ ఇచ్చింది.ఓన్లీ ప్రొఫెషనల్ స్లీపర్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ చూసిన వారంతా జోక్ అనుకుంటున్నారు. కాని స్లీపింగ్ జాబ్స్ రిక్రూట్ మెంట్ నిజమేనని సదరు కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఈఉద్యోగాలకు అమెరికాలోని న్యూయర్క్ లో నివాసముండేవారు లేదా..ఇతర ప్రాంతాల వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. సాధారణంగా ఇంట్లో అయినా సమయానికి మించి ఎక్కువ సేపు నిద్రపోతే పొదస్తమాను నిద్రపోకపోతే.. ఏదైనా పనిచేసుకోవచ్చు కదా అని తిడుతుంటారు పేరెంట్స్, ఎక్కువుగా పడుకుంటే సోమరితనం పెరిగిపోతుందంటారు. కాని ఇప్పుడు నిద్రపోయేందుకు జీతాలిస్తామంటున్నాయి కంపెనీలు..ఈ ఉద్యోగం వెనుక కంపెనీకి లాభాలు కూడా ఉన్నాయి.
ఈఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు తమ ప్రొడక్ట్ పరుపులపై ఎలా నిద్ర పోతారు. పరుపుపై పడుకోవడం వల్ల వారు ఎటువంటి విలాసవంతమైన అనుభవాలను పొందుతారనే దాని గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కంపెనీ పేర్కొంది. దీని కోసం భారీ ప్యాకేజీని ఆఫర్ చేస్తామంటోంది. తమ కంపెనీ ప్రొపెషనల్ స్లీపర్స్ కోసం వెతుకుతుందని, అనుభవమున్న స్లీపర్లు టిక్ టాక్ వీడియో ద్వారా తమ నైపుణ్యాలను ప్రదర్శించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని న్యూయర్క్ కు చెందిన పరుపుల కంపెనీ కోరుతోంది. ఈఉద్యోగానికి దరఖాస్తు గడువు ఆగష్టు 11తో ముగుస్తుందని వెల్లడించింది. మరెందుకు ఆలస్యం మీరు ప్రొఫెషనల్ స్లీపర్స్ అయితే ఈజాబ్ కు అప్లై చేసేయండి.. మరోవైపు ఈ జాబ్ నోటిఫికేషన్ పై కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు..ఇలాంటి జాబ్ లు మనకు కూడా ఉంటే ఎంత బాగుండో అని చాలా మంది అంటున్నారు.. ఏది ఏమైనా ఇలా రావాలంటే రాసి పెట్టి ఉండాలి..