https://twitter.com/SmitaSabharwal/status/1662288969923702784?s=20
తెలంగాణ సీఎంఓ అధికారిణిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కాసేపటి క్రితమే ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో స్మితా సబర్వాల్ ప్రజలు తాగు నీటి కోసం ఎంత ఇబ్బందులు పడుతున్నారు అన్న అంశం గురించి ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. గతంలో ఈమె పనిచేసిన జిల్లాలో ఏ విధంగా నీటి కోసం ఇబ్బందులు పడ్డారు… ఇప్పుడు ఆ జిల్లా ఆ రాష్ట్రము ఎంతగా అభివృద్ధి చెందింది అన్నది వివరించడానికి ప్రయత్నం చేశారు. కరీంనగర్ జిల్లాలో పది సంవత్సరాల క్రితం నీటి కోసం రోడ్లపైన ధర్నాచేసే పరిస్థితి, కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణ ప్రభుత్వం కోటి ఇళ్లకు పైగానే స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తోంది.