జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు జనరల్ బోగీలో పొగలు

-

లింగంపల్లి నుంచి విశాఖ వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలులో ఇవ్వాల (మంగళవారం) పొగలు వచ్చాయి. మూడు కంపార్ట్ మెంట్లలో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మొదట ఓ జనరల్ బోగీలో పొగలు రావడాన్ని ఏలూరు వద్ద గుర్తించారు. అధికారులు స్పందించి సంబంధింత మరమ్మతులు చేయడంతో పొగ రావడం ఆగిపోయింది. దాంతో, అరగంట అనంతరం రైలు ఏలూరు నుంచి బయల్దేరింది. అయితే తాడేపల్లిగూడెం వద్దకు చేరుకోగానే, మరో రెండు బోగీల్లో పొగ రావడం ప్రారంభమైంది. అధికారులకు సమాచారం అందించగా… జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను తాడేపల్లిగూడెం స్టేషన్ వద్ద నిలిపివేశారు.

రైలు ఆగడంతో, పొగలు వచ్చిన బోగీల్లోని ప్రయాణికులు ఒక్కసారిగా కిందికి దూకి పరుగులు తీశారు. సిబ్బంది కాసేపు శ్రమించి పొగ రాకుండా కట్టడి చేశారు. బ్రేకులు పట్టేడం వల్లనే పొగలు వచ్చాయని వారు తెలిపారు. కాగా, బోగీల్లో పొగలు రావడంతో అగ్నిప్రమాదం జరుగుతుందేమోనని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version