Sneha: వన్నె తగ్గని అందం..నటి స్నేహ గ్లామర్‌ ట్రీట్‌కు కుర్రకారు ఫిదా

-

తెలుగు వారికి, సినీ ప్రేక్షకులకు సుపరిచితం హీరోయిన్ స్నేహ. టాలీవుడ్ సీనియర్ హీరోలతో పలు చిత్రాలు చేసిన ఈమె..ప్రస్తుతం తమిళ్ భాషలో పలు చిత్రాలు చేస్తోంది. ఈమె వయసు పెరిగినా అందం మాత్రం వన్నె తగ్గడం లేదని చెప్పొచ్చు.

తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న స్నేహ.. సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తుంటుంది సీనియర్ నటి.

తెలుగు ప్రేక్షకులకు చివరగా ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ఫిల్మ్ లో కనిపించింది. ఈ పిక్చర్ లో రామ్ చరణ్ వదినగా స్నేహ నటించింది. తాజాగా ఆమె వెరీ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది. జ్ఞాపకాలుగా మారితేనే క్షణాల విలువ మనకు తెలుస్తుందని పేర్కొంటూ పసుపు రంగు చుడీదార్, డ్రెస్సు ధరించిన ఫొటోలను షేర్ చేసింది.

హోమ్లీ హీరోయిన్ గా పేరొందిన స్నేహ తాజా ఫొటోల్లో గ్లామర్‌తో కుర్రకారు మతిపోయేలా ఫోజులిచ్చింది. ఇక స్నేహ ఫొటోలు చూసిన నెటిజన్లు, సెలబ్రిటీలు లైక్స్ కొడుతూనే ఉన్నారు. ‘వెరీ బ్యూటిఫుల్, గార్జియస్, బ్యూటిఫుల్, అందాల భామ’ అని కామెంట్స్ చేస్తున్నారు. స్నేహ ప్రస్తుతం తమిళ్ భాషలో కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులోనూ సరైన పాత్ర దొరికితే తప్పకుండా వెండితెరపైన మళ్లీ కనిపించి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది స్నేహ.

Read more RELATED
Recommended to you

Exit mobile version