ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త కేబినెట్ లీస్ట్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ విడుదల చేశారు. కాగ లీస్ట్ లో కొడాలి నాని పేరు లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నా కొడాలి నాని.. మంత్రి వర్గంలో లేకపోవడంపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కొడాలి నానికి మంత్రి పదవి కాకుండా.. ఒక కీలక పదవి అప్పజేప్పారు.
స్టెట్ డెవలప్ మెంట్ బోర్టు చైర్మెన్ గా కొడాలి నానిని సీఎం జగన్ ఎంపిక చేశారు. స్టెట్ డెవలప్ మెంట్ బోర్డె చైర్మెన్ బోర్డుకు చైర్మెన్ మాత్రమే కాకుండా.. కేబినెట్ హోదా ఇవ్వడానికి కూడా సీఎం జగన్ సిద్ధం అయ్యారు. కాగ త్వరలోనే ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డును త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. చైర్మెన్ గా కొడాలినానిని, వైస్ చైర్మెన్ గా మల్లాది విష్ణును నియమించడానికి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ సిద్ధం అవుతున్నారు.