నా కష్టాలు ఎవరూ పడలేదు.! అయినా కూడా.!

-

ప్రస్తుతం తెలుగు సినిమా లో వరలక్ష్మి శరత్ కుమార్ హవా నడుస్తోంది. తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు తమిళంలో కంటే తెలుగులో అవకాశాలు ఇస్తున్నారు. తాను వేసిన పాత్రలు తనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. నాన్న పేరు నిలబెట్టింది అని ఆమెను పొగుడుతున్నారు.ఇప్పుడు ఇంతగా ఫామ్ లో వున్న వరలక్ష్మీ ఒకప్పుడు సినిమాలకు పనికి రాదని మొహం మీదనే చెప్పేశారట.

మొదట్లో ఈమె అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అనేక ప్రొడక్షన్ హౌస్ లకు తన ఫోటోస్, వీడియోస్ పంపిందట. చాలా మంది వాటిని పట్టించు కోలేదట. అప్పట్లో తన గొంతు విని ఇంత బొంగురు గొంతు సినిమాలకు పనికి రాదని చెప్పి, అవమానం గా ఫీల్ చేశారట. దీనితో వరలక్ష్మీ దానిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని తన యాక్టింగ్ మీద దృష్టి పెట్టిందట. గతాన్ని తలచుకొని ఎమోషనల్ అయ్యింది వరలక్ష్మి. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదిక గా ఒక పోస్ట్ లో పంచుకుంది.

అయితే ఈ పదేళ్ల నా సినీ ప్రయాణం అంతా జాలీగా సాగలేదు. ప్రారంభంలో ఎన్నో అవమానాలు పడ్డాను. మరెన్నో తిరస్కారాలకు గురయ్యాను.  వీటిని నేను పట్టించు కోలేదు. అవి నా ప్రయాణం ను ఆపలేదు. నన్ను నేను చాలా మార్చు కున్నాను. నా పనినే నమ్ముకున్నాను.ఇప్పుడు తిరిగి చూస్తే 45 చిత్రాలు చేశాననే తలుచుకుంటుంటే మంచి అనుభూతికి లోనవుతున్నా. నాలోని నటిని వెలికి తీసే పలు  అవకాశాలు వస్తున్నాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని తన పోస్ట్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version