బాలయ్య భైరవద్వీపం సినిమా వెనుక ఇన్ని కష్టాలా..?

-

బాలకృష్ణ సినీ కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం భైరవద్వీపం. ఇక ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈ చిత్రాన్ని అంత అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఏదైనా సినిమా తెరకెక్కిస్తున్నాడు అంటే అది నిజంగా ఆయన ఏదైనా ప్రయోగం చేస్తున్నాడని వార్త వైరల్ అవుతుంది. నిజంగా నిర్మాతగా ఈయన చేసిన ఎన్నో సాహసాలు కూడా మనకు గుర్తుకు వస్తాయి. సంగీత దర్శకుడిగా, రచయితగా కూడా మంచి అనుభవం ఉంది . ఇక తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాస్ పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం వంటి సినిమాలు చేసి ప్రయోగాలకు అద్దం పట్టాడు.

ఇకపోతే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సింగీతం శ్రీనివాస్ ఎన్నో విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా భైరవద్వీపం సినిమా గురించి సింగీతం శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఈ సినిమాలో ఒక పాటను వేటూరి రాయాల్సి ఉండగా.. ఇదిగో వస్తున్న.. అదిగో వస్తున్న అంటూ చెప్పడం ఇక ఎన్ని రోజులు ఎదురు చూసిన ఆయన రాకపోవడంతో పని ఆగిపోకూడదని ఆవేశంతో నేనే ఆ సందర్భానికి తగినట్టుగా ఒక పాట కూడా రాశాను. ఇక ఆవేశం తగ్గిన తర్వాత మళ్లీ వేటూరి కి కబురు పంపితే ఆయన వచ్చారు . ఇక నేను రాసిన పాటను చూపించి నచ్చితే ఉంచండి.. లేకపోతే తిరిగి వేరే పాట రాయమని చెప్పాను.. కానీ నేను రాసిన ఆ పాట చాలా బాగుందని అన్నారు . ఇక అదే “విరిసినది వసంతగానం” పాట.. ఇక ఈ సినిమా మంచి ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది అంటూ అని తెలిపారు.ముఖ్యంగా బాలకృష్ణ కురూపి పాత్ర కోసం ఎంతో కష్టపడ్డారు. ఇక ఎప్పుడు కూడా ఊహించని విధంగా బాలకృష్ణను చూపించి వాళ్లను మరింత ఆశ్చర్యపరిచాము. ఇక బాలకృష్ణ ఈ సినిమాలో చాలా గొప్పగా పనిచేశారు. ఎంతో కష్టపడ్డారు.. 10 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే గెటప్ లోనే ఉండేవారు. ఇక ఆ గెటప్ తో భోజనం చేయడం కుదరదు. అందుకే ఒక స్ట్రా సహాయంతో జ్యూసులు మాత్రమే తాగేవారు. ఇక ఒక రోజున ఒక షాట్ కి సంబంధించిన లైటింగ్ కి సమయం పడుతుందని బాలకృష్ణ గారిని మధ్యాహ్నం 12 గంటలకు రమ్మని చెప్పాము. కానీ ఎన్టీఆర్ గారు.. ఒకవేళ లైటింగ్ ముందుగానే అయిపోతే.. నీ ద్వారా షూటింగ్ లేట్ కాకూడదు.. వెళ్ళు అని బాలకృష్ణ గారిని పంపించారు. ఇక ఎన్టీఆర్ నుంచే బాలకృష్ణకు ఆ క్రమశిక్షణ వచ్చింది అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version