RADHE SHYAM : రాధేశ్యాం నుంచి మ‌రో అప్డేట్..రొమాంటిక్‌ సింగిల్ రిలీజ్

-

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. హీరోగా చేసిన తాజా సినిమా రాధే శ్యాం. ఈ సినిమా పై అంచ‌నాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పాన్ ఇండియా మూవీ గా తెర‌కెక్కుతున్న ఈ సి ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది.

1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. “రాధేశ్యామ్ నుంచి హిందీ సెకండ్ సింగిల్ ‘సోచ్ లియా’ సాంగ్ ను విడుద‌ల‌ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాటలో పూర్తి గా ప్ర‌భాస్‌, పూజా హెగ్డే ల మ‌ధ్య ఎమోష‌న‌ల్ బాండ్ క‌నిపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version