హైదరాబాద్ లో దారుణం…బాలికపై 5 గురు ఆటోడ్రైవర్లుల అత్యాచారం

-

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై ఆటోడ్రైవర్లులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. నాలుగు రోజుల పాటు మెడిపల్లి లో బాలిక ను రేప్ చేశారు ఐదుగురు ఆటో డ్రైవర్లు. అయితే… బాలిక ను రేప్ చేసిన ఐదుగురు ఆటో డ్రైవర్ లు అరెస్ట్ అయ్యారు. ఈ కేసు వివ‌రాల్లోకి వెళితే.. కాచిగూడ కు చెందిన మైనర్ బాలిక కోఠి లోని ఓ కళాశాలలో చదుకుతుంది. నాలుగు రోజుల క్రితం బాలిక తనకు తెలిసిన ఆటో డ్రైవర్ తో ఆటోలో కళాశాలకు వెళ్ళింది ఆ బాలిక‌. కళాశాల కు వెళ్లే ఆ బాలికను…మాయ మాటలు చెప్పి మేడిపల్లి తీసుకొని పోయాడు ఆటో డ్రైవర్.

రాత్రి అవుతున్న కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన త‌ల్లి దండ్రులు పోలీసులను పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు… మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసుకొని విచారణ చేశారు. మేడిపల్లి లో 4 రోజుల పాటు రోజు ఒకో ప్రాంతం కు తీసుకుని వెళ్లి ఆటో డ్రైవర్లు బాలిక పై అత్యాచారం పాల్ప‌డ్డ‌ట్లు పోలీసులు గుర్తించారు. బాలికను ఛాదర్ ఘాట్ ప్రాంతంలో ఆటో డ్రైవర్ వదిలి వెళ్లాడు. తనపై ఆటో డ్రైవర్ లు చేసిన అఘాయత్యాని పోలీసుల‌కు తెలియ జేసింది ఆ బాలిక. దీంతో అత్యాచారం చేసిన 5 గురు ఆటోడ్రైవర్ లను అరెస్ట్ చేశారు పోలీసులు. అంతేకాదు…ఆ ఐదుగురు ఆటో డ్రైవర్ లను రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version