రాయదుర్గం సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో నిందితులు అరెస్ట్…!

-

రాయదుర్గం సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు ఫిర్యాదు చేసిన నిఖిత ఏ ప్రధాన నిందితురాలు అని తెలిసింది. పూర్తి వివరాలు చూస్తే, తన సోదరుడు కిడ్నాప్ అయ్యినట్టు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది నిఖిత. నిఖితతో మాట్లాడుతున్నప్పుడే కిడ్నాప్ జరిగింది. ఈ నెల 4వ తేదీన ఇది జరిగింది. ఈ విషయం పై డీసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ నెల 4వ తేదీ ఉద్యోగి సురేందర్ ని కిడ్నాప్ చేశారు అని, 48 గంటల్లో చేదించాము అని అన్నారు.

డయల్ 100 కి ఇద్దరు సమాచారాన్ని అందించారు. నికిత కిడ్నాప్ జరుగుతున్నా సమయంలో అక్కడే ఉంది. అలానే ఆమెతో పాటు ఇంకో వ్యక్తిని కూడా విచారించమని పోలీసులు చెప్పారు. నికిత, వెంకటకృష్ణ లకు పరిచయం ఉంది. ఇద్దరు కలిసి సురేష్ తో కిడ్నాప్ ప్లాన్ చేశారు. తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రెండు కోట్లు అడిగారు. సురేష్ పై 21 కేసులు వున్నాయట. వెంకటకృష్ణ పై రెండు కేసులు వున్నాయట. ఈ కేసులో మొత్తం ఏడుగురు‌ నిందితులు అని పోలీసులు గుర్తించారు. ఇద్దరు పరారీలో వున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news