మొద‌లైన సూర్యగ్రహణం.. ఈ స‌మయంలో చేయ‌కూడ‌ని ప‌నులు..

-

సూర్యగ్రహణం ప్రారంభమయింది. గ్రహణ స్పర్శ కాలం ఉదయం 8.11 నిమిషాలకు, గ్రహణ మధ్యకాలం ఉదయం 9.38 నిమిషాలకు, గ్రహణ మోక్ష కాలం 11.20 నిమిషాలు. ఈ సారి సూర్యగ్రహణం భారత్‌లో 3 గంటల 12 నిమిషాల సేపు కొనసాగుతుంది. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్యగ్రహణం వస్తుంది. గురువారం నాడు సంభవించే వార్షిక సూర్యగ్రహణం ఈ సారి భారత్‌లో చాలా ప్రాంతాల్లో కనిపించనుంది. దక్షిణ భారత దేశంలో ఈ సారి సూర్యగ్రహణం అధికంగా కనిపించనుంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళలో సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువ.

ఈ సూర్యగ్రహణాన్ని చూడడానికి ప్రజలంతా ఆసక్తి చూసిస్తున్నారు. అయితే దీనిని వీక్షించొచ్చు కానీ, నేరుగా వీక్షించకూడదు. బ్లాక్ ఫ్రేమ్, ఎక్స్‌రే వంటి వాటితో చూడొచ్చు. ఈ సూర్యగ్రహణాన్ని చూడాలనుకునే వారు సరైన జాగ్రత్తలు పాటించాలి. గ్రహణ సమయంలో వండిన ఆహారపదార్ధాలు, ఫలాలు కలుషితం అవుతాయని పూర్వికులు భావించేవారు. అందుకే ఆ సమయంలో వండిన అన్నం, పండ్లు తినకూడదని చెబుతారు. గ్రహణ కాలం వరకూ దేవతా మూర్తులమీద, నిల్వఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసి, గ్రహణం వెళ్లిపోయాక తీసి వేయాలి.

అలాగే ఆ సమయంలో భోజనం తినడం గానీ, నీరు త్రాగడం గానీ, సంభోగం వంటి పనులు చేయకూడదట. ముఖ్యంగా ఇక ఈ గ్రహణకాలంలో గర్భిణీలు బయటకి రావడం, గ్రహణ వీక్షణ చేయడం మంచిదికాదని చెబుతున్నారు. ఇక కొన్ని రాశుల వారు ఈ గ్రహణ సమయంలో బయటికి వెళ‌్లకూడదనే చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ధనురాశి వారు శాంతి చేయించుకోవాలని, ప్రత్యక్షంగా వీక్షించరాదని జ్యోతిషులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version