కేసీఆర్ నాకు తండ్రిలాంటి వ్యక్తి, నా పెళ్లి చేసారు

-

ముఖ్యమంత్రి కెసిఆర్ దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి గా సోలిపేట సుజాతను ప్రకటించారని ఆర్ధిక మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. నియోజకార్గ ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 2004లో శాసనసభ్యుడు గా ఎన్నికైన తర్వాత రామలింగారెడ్డి గారు అనేక ఉద్యమాలు చేశారని అన్నారు. రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగించాలని వారి కుటుంబానికి టిక్కెట్ ఇచ్చినందుకు కెసిఆర్ కు ధన్యవాదములని తెలిపారు.

2004 నుంచే నాకోసం ఎన్నికల్లో ఇంటింటా తిరిగి ప్రచారం చేసిన వ్యక్తి సోలిపేట సుజాత అన్నారు. సోలిపేట సుజాత ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కోరారు. తెలంగాణ లో ఉన్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్ గా నిలిచాయని అన్నారు. సోలిపేట సుజాత మాట్లాడుతూ… కెసిఆర్ నాకు కన్నతండ్రి లాంటివాడని అన్నారు. గతంలో మా పెళ్లి… తర్వాత మా పిల్లల పెళ్లి చేశారని అన్నారు. కెసిఆర్ నాకు కొండంత ధైర్యం.. నా భర్త చనిపోతే ఇంటికి వచ్చి ధైర్యం ఇచ్చిండని కీర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version