గుడ్ న్యూస్.. ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లులో స‌డ‌లింపులు

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకువ‌చ్చిన ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తుంది. ఇప్ప‌టికే హుజురాబాద్ లో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం.. త్వ‌ర‌లో రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయ‌డానికి కార్య‌చ‌ర‌ణ చేప‌డుతుంది. రాష్ట్రంలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 మంది చొప్పున ల‌బ్ధిదారుల‌ను మొద‌టి ద‌శ‌లో ఎంపిక చేస్తోంది. కాగ ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లులో రాష్ట్ర ప్ర‌భుత్వం స‌డ‌లింపులు చేసింది. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు ల‌బ్ధి దారుడికి ఒక్కో యూనిట్ గా భావించి ఉపాధి ఏర్పాట్లు క‌ల్పించేవారు.

కానీ ఈ స‌డ‌లింపుతో ఒక‌రి రూ. 10 ల‌క్షల‌తో ఒక్క యూనిట్ గ్రౌండ్ చేసే ప‌రిస్థితి లేని స‌మ‌యంలో భాగస్వామ్యంతో చేప‌ట్టే విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. దీంతో ల‌బ్ధిదారులు కొంత భాగ‌స్వామ్యంగా ఏర్ప‌డి.. స్వ‌యం ఉపాధి యూనిట్లు నెల‌కొల్పుకోవ‌చ్చు. కాగ చాలా మంది ల‌బ్ధిదారులు కారులు, మినీ ట్రాన్స్ పోర్టు వాహనాల‌కు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారికి ఈ స‌డ‌లింపు అవ‌సరం ఉండ‌క పోవ‌చ్చు. కానీ కొంత మంది ఎరువుల దుకాణాలు, ప్ర‌భుత్వ కాంట్రాక్ట్ లు వంటి అధికి ఖ‌ర్చుతో చేయాల్సిన ప‌నుల గురించి ప్లాన్ చేస్తున్నారు. వీరికి ఈ స‌డ‌లింపు ఉప‌యోగప‌డేలా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version