కొన్ని సంస్థలు.. వాటి విచిత్ర నిబంధనలు..!

-

సాధారణంగా ఏ కంపెనీలైనా తమకంటూ కొన్ని నిబంధనలు, పాలసీలు రూపొందించుకుని పాటిస్తాయి. ఆ నిబంధనలకు అనుగుణంగానే ఆయా కంపెనీలలో విధులు నిర్వహించే ఉద్యోగులు కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉద్యోగులకు ఇబ్బంది పెట్టేలా ఉండవు. కానీ, ఆ నిబంధనలు విన్నప్పుడు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాంటి నిబంధనలే కొన్నింటిని చూసేద్దాం రండి.

 

 

నెట్‌ఫ్లిక్స్‌లో..

ప్రముఖ ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తమ కొత్త పాలసీలను తీసుకొచ్చింది. మహిళలపై లైగింక వేధింపుల విషయంలో ‘మీ టూ’ ఉద్యమం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో పనిచేసే మహిళా ఉద్యోగుల వైపు ఐదు సెకన్లకు మించి చూసినట్లయితే లైంగిక వేధింపులకు పాల్పడినట్లేనని సంస్థ నిబంధన తీసుకొచ్చింది. మహిళల వైపు ఐదు సెకన్లకు మించి చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ హెచ్చరిస్తోంది.

 

గూగుల్‌లో..

మనకు ఏ అంశంపై సందేహం వచ్చినా గూగుల్‌లో వెతుకుతుంటాం. ఎన్నికల సమయంలో గూగుల్‌లో రాజకీయ అంశాలే హాట్ టాపిక్‌గా ఉంటాయి. అయితే గూగుల్ సంస్థలో పని చేసే ఉద్యోగులు మాత్రం రాజకీయాలపై అస్సలు చర్చించకూడదు. విధుల్లో ఉన్నప్పుడు కంపెనీ గురించి చెడుగా మాట్లాడటం, రాజకీయాలపై చర్చించడం, అనవసరమైన ముచ్చట్లు పెడుతున్నారని, 2019 ఆగస్టులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ నిబంధనను తీసుకొచ్చారు.

 

డిస్నీపార్కుల్లో..

ఎవరినైనా ప్రశ్నించేటప్పుడు వేలెత్తి చూపిస్తాం. కానీ డిస్నీపార్కుల్లో వేలెత్తి చూపించడం నిషేధం. ప్రపంచవ్యాప్తంగా ఆరుదేశాల్లో డిస్నీపార్కులు ఉన్నాయి. అయితే ఆయా పార్కుల్లో పని చేసే ఉద్యోగులు పర్యాటకులకు ఏదైనా చూపించాలంటే రెండు వేళ్లు ఉపయోగించి చూపించాలి. ఎందుకంటే పలు దేశాల్లో ఒక్క చూపుడు వేలును మాత్రమే ఎత్తి చూపిస్తే నేరంగా భావిస్తారు. అందుకే సంస్థ ఈ నిబంధన తీసుకొచ్చింది.

 

టెస్లా సంస్థలో..

టెన్లా సంస్థ అధినేత ఎలెన్ మస్క్‌కు విచిత్ర జబ్బు ఉంది. ఆయనకు ఘాటుగా ఉండే కొన్ని రకాల వాసనలు పడవు. ఈ సమస్యతో అనారోగ్యానికి గురవుతారని సమాచారం. అందుకే ఉద్యోగులు, మరికొందరు ఆయనను కలవడానికి వెళ్లినప్పుడు సెంట్ కొట్టుకుని వెళ్తుంటారు.

 

యాపిల్ సంస్థలో..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ తమ ఉద్యోగులకు కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని చెబుతోంది. ఐఫోన్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తి.. కస్టమర్ల రిపేర్లకు వచ్చినప్పుడు ఉద్యోగులు ‘క్రష్, ప్రాబ్లమ్, బగ్’ వంటి పదాలు అస్సలు వాడకూడదని చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version