జగన్ రెడ్డే రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయానికి పట్టిన పెద్ద దరిద్రం : సోమిరెడ్డి

-

మరోసారి వైసీపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వరి, పత్తి, మిరప, ఇతర వాణిజ్య పంటలు ఘోరంగా దెబ్బతిని రైతులంతా దిక్కుతోచక విలపిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ వ్యాఖ్యానించారు. కానీ రాష్ట్ర వ్యవసాయమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కరవు కహానీలు చెబుతూ, పనిగట్టుకొని మరీ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. తద్వారా సమస్యల్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు సోమిరెడ్డి. ఆయన.. జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ… మాండూస్ తుపాను ధాటికి రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన నష్టం వాటిల్లితే, నష్టనివారణ చర్యలు చేపట్టకుండా, వ్యవసాయం అంటే ఏమిటో తెలియని వ్యవసాయమంత్రి కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు.

చంద్రబాబు టైమ్ లో కరవు అని, జగన్ వచ్చాక వర్షాలే వర్షాలని వాగుతున్నాడని మండిపడ్డారు సోమిరెడ్డి. జగన్ రెడ్డే రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయానికి పట్టిన పెద్ద దరిద్రం అని విమర్శించారు సోమిరెడ్డి. “మంత్రిది మిడిమిడి జ్ఞానమని ఆయన మాటల్లోనే అర్థమవుతోంది. 2020లో రాష్ట్రంలో 161 మండలాల్లో కరవు వచ్చిన విషయం మంత్రికి తెలియదా? 73 మండలాలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొన్నాయన్న వాస్తవం కాకాణి విస్మరించారా? రాష్ట్రంలో మూడేళ్లు వర్షాలున్నా కూడా రాష్ట్ర రైతాంగం ఏం బాగుపడిందో మంత్రి చెప్పాలన్నారు సోమిరెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version