కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు

-

జీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ లో చేరటంపట్ల హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కిరణ్ కుమార్‌కు శుక్రవారం ఉదయం ఫోను చేసి శుభాకాంక్షలు తెలిపానన్నారు. ఆయనతో త్వరలోనే సమావేశమై రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై చర్చిస్తానన్నారు. కిరణ్ కుమార్ చేరికతో రాష్ట్రంలో బీజేపీ మరింత శక్తివంతమై ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

కాగా కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ సభ్యత్వాన్ని అరుణ్ సింగ్ అందించారు. కిరణ్ కుమార్ రెడ్డికి కండువా కప్పి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీలోకి ఆహ్వానించారు. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని తానెప్పుడూ అనుకోలేదన్నారు. తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్.. ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతోందన్నారు. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ చెల్లాచెదురైందన్నారు. విభజనపై కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందన్నారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోందన్నారు. బీజేపీ ఎదుగుతున్నకొద్దీ కాంగ్రెస్ దిగజారుకుంటూ వచ్చిందన్నారు. 1980లో 7.7శాతం ఉన్న బీజేపీ ఓటింగ్.. 2019లో 37 శాతానికిపైగా పెరిగిందని కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version