బద్వేల్ బరిలో జనసేన : క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు

-

విజయవాడ : బద్వేల్‌ ఉప ఎన్నిక పోటీపై ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బద్వేల్ ఉపఎన్నిక కు సంబంధించి తమ మిత్ర పక్షమైన జనసేన పార్టీ తో చర్చిస్తామన్నారు సోము వీర్రాజు. జనసేన పార్టీ తో చర్చలు జరిపిన అనంతరం బద్వేల్ అభ్యర్థి ఎవరు అన్నేది ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చేశారు సొమ్మువీర్రాజు. మత్స్య కార్మికులకు ఆర్థిక తోర్పాటు ఇవ్వాలని… మత్స్య కారుల సంఘాన్ని సంప్రదించకుండా వివాదాస్పద జీవో ని తీసుకుని రావాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.

ఏ జిల్లా లో పైలెట్ ప్రాజెక్టు మొదలు పెడతారో అక్కడే బీజేపీ ఉద్యమం మొదలు పెడుతుందన్నారు.. 7న కేంద్ర మత్య శాఖ మంత్రి మురుగన్ ఈ ఉద్యమంలో పాల్గొంటారని… 9 న పెద్ద ఎత్తున నిరసన సభ ఏర్పాటు చేస్తున్నామన్నారని వెల్లడించారు. రోడ్ల కు సంబంధించి తమ మిత్రపక్షమైన జనసేన పెద్ద ఎత్తున్న ఉద్యమం చేస్తుందని పేర్కొన్నారు. ఏపీలో రోడ్ల దుస్థితి పై కేంద్రం దృష్టికి తీసుకెళ్ళామని.. ప్రభుత్వ బాధ్యత కనీసం రోడ్లు వెయ్యడమన్నారు. రోడ్లు వేసేందుకు కేంద్రం నిధులు విడుదల చేసిందని… రెండున్నార సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి రోడ్లు వేయలేదని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version