టీడీపీకి షాక్‌: బీజేపీ నేత సోము వీర్రాజుతో భేటీ అయిన గంటా..

-

ఏపీలో టీడీపీకి వరుసుగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు వ‌ర‌స పెట్టి సైకిల్ దిగుతున్నారు. అయితే టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. ఈ తరుణంతో ఈరోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గంటాను బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ రోజు ఆయన నివాసంలో కలిశారు.

ఈ సందర్బంగా వీరు చాలాసేపు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇరువురి మధ్య పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. మరోవైపు ఈ అంశంపై గంటా వర్గీయులు స్పందించారు. కేవలం బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు సోము వీర్రాజు వచ్చారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version