ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశాడు. ఈ లేఖ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షానే కోరాడు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా అమిత్ షా ను కోరాడు.
దీంతో ఆంధ్ర ప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన మొత్తం బకాయిలను ఆంధ్ర ప్రదేశ్ కు వెంటనే వచ్చేలా చూడాలని కేంద్ర హోం మంత్రి కి విజ్ఞప్తి చేశాడు. వీటి తో పాటు కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై కేంద్ర జల శక్తి ఇచ్చిన గెజిట్ త్వరగా అమలు చేయాలని,, అందుకు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు యొక్క ఆధార్టీ ని ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని కోరాడు. వీటి తో పాటు రాష్ట్రంలో ఉన్న విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు యథవిధిగా కొనసాగేలా చర్యలు తిసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కోరాడు.