లాక్ డౌన్ ఉల్లంఘించాడని తండ్రిపై కొడుకు ఫిర్యాదు…!

-

ప్రపంచ దేశాలు, ప్రభుత్వాలు, వైద్యులు ఇలా ఎందరు గొంతు చించుకుని బయటకు రావద్దని చెప్తున్న కానీ కొంతమంది లెక్కచేయడం లేదు. ఎంత మందికి అని ఎవరైతే మాత్రం చెబుతారు. మనం ఆరోగ్యంగా ఉంటే మన ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని ఎవరికి వారు తెలుసుకోవాలి. ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి క్షేమంగా ఉండమని చెబుతున్నా కానీ నిబంధనలు పాటించని వారు చాలా మంది ఉంటున్నారు.

ఢిల్లీలో అలాంటి ఒక వ్యక్తిపై తన కన్న కొడుకునే పోలీసులకు ఫిర్యాదు చేశాడు . ఢిల్లీలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 59 యేళ్ళ వ్యక్తి నీ కన్నకొడుకే బుద్ధిచెప్పాడు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా అతను బయటకు వెళ్తున్నాడు. చాలాసార్లు బయటకు వెళ్ళోద్దు ఇంట్లోనే ఉండాలని తండ్రికి చెప్పాడు కొడుకు. అయినా సరే తండ్రి వినకుండా బయటకు వెళ్లడం తో విసిగిపోయిన కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాక్ డౌన్ ని ఉల్లంఘిస్తే పోలీసులు ఎక్కడిక్కడ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర సర్కార్ కూడా ఈ విషయంలో ఆగ్రహంగా ఉంది. రెండేళ్ళ పాటు జైలు శిక్ష విధించాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఇక రాష్ట్రాలు కూడా ఈ విషయంలో ఆగ్రహంగానే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version