Son of India review: సన్నాఫ్ ఇండియా ఎలా ఉందంటే..?

-

కలెక్షన్ కింగ్ చాలా కాలం తరువాత లీడ్ రోల్ లో నటించిన సినిమా ‘ సన్నాఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లో మంచు విష్ణు నిర్మాతగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా.. సన్నాఫ్ ఇండియాను రూపొందించారు.

చిత్రం : సన్ ఆఫ్ ఇండియా
నటీనటులు : మోహన్ బాబు, తనికెళ్ల భరణి, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, సునీల్
నిర్మాత : మంచు విష్ణు
బ్యానర్ : 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
దర్శకత్వం : డైమండ్ రత్నబాబు
సంగీతం : ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: సర్వేశ్ మురారి
విడుదల తేదీ : ఫిబ్రవరి 18, 2021

కథ : కడియం బాజ్జీ ( మోహన్ బాబు)… ఎన్ఐఏ అధికారి ఐరా( ప్రగ్యా జైశ్వాల్) దగ్గర డ్రైవర్ గా పని చేస్తుంటారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి మహేంద్ర భూపతి( శ్రీకాంత్) తో పాటు మరో ఇద్దరు కిడ్నాప్ అవుతారు. ఆ కేసును చేధించే క్రమంలో రంగంలోకి దిగుతుంది ఐరా నేతృత్వంలోని ఎన్‌.ఐ.ఎ బృందం. ఈ కేసును విచారిస్తున్న క్రమంలో ఈ కిడ్నాప్ లకు పాల్పడింది బాజ్జీ అని తెలుస్తుంది. అయితే ఆయన అసలు పేరు విరూపాక్ష. సాధారణ ఫ్రింటింగ్ ప్రెస్ యజమాని. ఓ సాధారణ వ్యక్తి కేంద్ర మంత్రిని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. బాబ్జీ భార్య గా మీనా, అతని కూతురు ఎలా చనిపోతారు. ఓ రాజకీయ నాయకుడు( పోసాని క్రిష్ణమురళి) విరూపాక్ష కుటుంబానికి చేసిన దారుణం ఏమిటనేది తెరపైనే చూడాలి.

సినిమా మొత్తం మోహన్ బాబే:

సినిమాలో ముందుగా చెప్పినట్లు మొత్తం స్క్రీన్ పై మోహన్ బాబే కనిపిస్తారు. మిగతా క్యారెక్టర్లకు పెద్దగా స్కోప్ లేనట్లుగా కనిపిస్తుంది. ఓ వ్యక్తికి అన్యాయం జరగడం.. దానికి ప్రతీకారం తీర్చుకోవడం అనేది చాలా సీనిమాల్లో చూశాం. కథ, కథనంలో కూడా పెద్దగా కొత్తదనం కనిపించలేదు. సునీల్‌, అలీ, బండ్ల గ‌ణేష్, పృథ్వీ త‌దిత‌ర హాస్య‌న‌టులున్నా ఆ స‌న్నివేశాలు పెద్ద‌గా న‌వ్వించ‌వు. మోహన్ బాబు నటన, డైలాగులు తప్పితే పెద్దగా ఆసక్తి కలిగించే అంశాలు సినిమాలో లేకపోవడం మైనస్. ఓ ప్రయోగంగా సినిమాను తీశారు. అయితే ప్రయోగం పెద్దగా సక్సెస్ కాలేదు. చివరకు ఓటీటీలో విడుదల చేయాల్సిన సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు.

బలాలు : మోహన్ బాబు, డైలాగ్స్, మెసేజ్…

బలహీనతలు : పాత కథ, కొత్తదనం లేకపోవడం

Read more RELATED
Recommended to you

Exit mobile version