కాంగ్రెస్ నేత, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. సునీల్ శాస్త్రి ఇప్పటి వరకు బీజేపీలో ఉన్నాడు. కాగ మంగళవారం కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్ర సమక్షంలో సునీల్ శాస్త్రి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ తన ట్టిట్టర్ వేదికగా ప్రకటించింది. సునీల్ శాస్త్రీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న ఫోటో ను కూడా షేర్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ సైనికుడు, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రిని కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం రోజు కలవడం సంతోషంగా ఉందని కామెంట్ కూడా పెట్టారు. అలాగే ఇద్దరు కలిసి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి అన్నీ చర్చించామని అన్నారు. ఇద్దరు కలిసి పోరాడుతామని తెలిపారు. అలాగే ఉత్తర ప్రదేశ్ లో తాము తప్పక గెలుస్తామని కూడా ప్రకటించారు. కాగ సునీల్ శాస్త్రి గతంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి గా కూడా పని చేశారు. అలాగే సునీల్ శాస్త్రి రాజకీయాల్లోకి రాకముందు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేశారు.
कांग्रेस स्थापना दिवस से बेहतर क्या मौका हो सकता था कि कांग्रेस के सिपाही व भारत के पूर्व प्रधानमंत्री श्री लाल बहादुर शास्त्री जी के बेटे श्री सुनील शास्त्री जी से सप्रेम भेंट कर तमाम विषयों पर चर्चा की।
देश के लिए मिलकर लड़ेंगे, जीतेंगे pic.twitter.com/NKZBaFokXK
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 28, 2021