తల్లి అంత్యక్రియల కోసం కొడుకు కష్టం…!

-

లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ప్రజలు ఒకరకంగా చెప్పాలి అంటే నరకం చూస్తున్నారు అనేది వాస్తవం. చాలా మందికి వైద్యం అందడం లేదు. కేవలం కరోనా బాధితులకు మాత్రమే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చికిత్స అందుతుంది. ఇది పక్కన పెడితే తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. . ఢిల్లీలోని దక్షిణ అనార్కలిలో నివసిస్తున్న ఈశ్వరి దేవి (65) చాలాకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ,

ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను కుమారుడు హరీష్, ఇద్దరు కుమార్తెలు నాలుగు రోజుల క్రితం గురు తేగ్ బహదూర్ ఆసుపత్రిలో జాయిన్ చేసారు. ఆమెకు కరోనా పరిక్షలు చేయగాకరోనా లేదని నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. హరీష్ తన తల్లి మృతదేహాన్ని జాగ్రత్తగా ఒక వాహనంలో ఇంటికి తీసుకుని వెళ్ళగా వీలైనంత త్వరగా నిగంబోద్ ఘాట్ వద్దకు తీసుకెళ్లమని ఆయనకు సూచించారు.

మృతురాలి కొడుకు, కుమార్తె నిగంబోడ్ ఘాట్ వద్దకు ఒక ప్రత్యేక వాహనంలో తీసుకుని వెళ్ళారు. ఎవరూ కూడా అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాకపోవడంతో నర్ సేవాకు చెందిన ఇద్దరు సభ్యులు, నారాయణ సేవా సంస్థ, నిగంబోడ్ ఘాట్ ఉద్యోగి వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చి అంత్యక్రియలు చేయడానికి గానూ తమ వంతు సహాయ సహకారాలు అందించి పూర్తి చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version