గత నాలుగు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గురువారం కూడా బంగారం ధరలు క్రమంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర 22 క్యారెట్లు పది గ్రాములకు 180 రూపాయల వరకు పెరగడంతో 44,420 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే పది గ్రాములకు 190 రూపాయల పెరగడంతో 47,190 రూపాయలకు చేరుకుంది.
విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్లు పది గ్రాములకు 180 రూపాయల వరకు పెరిగింది. 44,420 రూపాయలుగా ఉంది బంగారం. 24 క్యారెట్ల బంగారం ధర 190 రూపాయలకు చేరుకుంది. దీనితో 47,190 రూపాయలకు చేరుకుంది. దేశరాజధాని ఢిల్లీలో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1230 రూపాయల తగ్గుదలతో 47,020 రూపాయల వద్దకు చేరుకుంది.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 810 రూపాయల తగ్గడంతో 45,340 రూపాయలకు చేరింది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వెండి ధర 41 వేల మార్క్ దాటింది.