అప్పుల్లో కూరుకుపోయిన సోనమ్ కపూర్.. ఏకంగా రూ.33 కోట్ల విలువైన ఇంటినే..!

-

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చెప్పలేము. గతంలో నుంచి కూడా ఆర్థిక సమస్యలు సెలబ్రిటీలను వెంటాడుతూనే ఉన్నాయి. కొంతమంది సినిమాలలో అవకాశాలు వస్తున్నప్పటికీ ఆ డబ్బును దాచుకోలేక ఇతరులకు దానం చేస్తూ చివరికి ఏమిలేని అనాధగా మిగిలితే.. మరికొంతమంది వరుస ఫ్లాప్ లతో సినిమా అవకాశాలు లేక ఉన్న ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోని బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కూడా అప్పుల్లో కూరుకుపోయారు. ఏకంగా రూ.33 కోట్ల రూపాయల విలువైన ఇంటిని అమ్మేసినట్లు ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఎనిమిది సంవత్సరాల క్రితం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ ను కొనుగోలు చేసింది. 2015 జూన్ నెలలో రూ.18 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీనిని రూ.32.50 కోట్లకు ఢిల్లీ బేస్డ్ కంపెనీ అయిన ఎస్ఎంఎఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అమ్మేసినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. గతవారం డిసెంబర్ 29న ఈ ఇంటిని అమ్మేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రూ.1.95 కోట్ల రూపాయలతో స్టాంప్ డ్యూటీ కూడా జరిగిందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ ఇళ్ళు తూర్పు బాంద్రాలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో జి బ్లాకులో మూడవ అంతస్తు మీద సిగ్నేచర్ ఐలాండ్ మీద ఉంది. ఇక ఈమె ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు పైగానే అవుతుంది. ప్రస్తుతం ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతోనే ఆమె ముంబైలో ఉన్న తన విలాసవంతమైన ఫ్లాట్ ను అమ్ముకుందని అంటున్నారు. మరి దీనిపై పూర్తి వివరాలు తెలిసే వరకు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version