ఆందోళనలో కాంగ్రెస్ నేతలు: ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సోనియా గాంధీ ఫ్లైట్ … !

-

బెంగుళూరు లో దేశ బాగు కోసం విపక్షాలు అన్నీ కలిసి తీసుకున్న నిర్ణయం కూటమి పేరును UPA నుండి INDIA గా మార్చడం… ఈ మీటింగ్ లో ఎన్డీఏ కూటమిని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ఇకపై మన అందరి కార్యాచరణ ఉండాలని గట్టిగా అనుకుని మీటింగ్ ను ముగించారు. అనంతరం ఎవరి దారిలో వాళ్ళు తమ తమ స్థానాలకు ప్రయాణం అయ్యారు. అదే విధంగా సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీలు ఇద్దరూ ఢిల్లీ ఫ్లైట్ లో ఎక్కారు. కానీ మార్గం మధ్యలో విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఫైలట్ విమానాన్ని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో హఠాత్తుగా ల్యాండ్ చేశారు. ఈ ఊహించని పరిణామానికి ఒక్కసారిగా ఫ్లైట్ లో ఉన్న వారందరూ భయానికి గురయ్యారు. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం విమాన ప్రయాణానికి ఢిల్లీ మార్గంలో వాతావరం అంత అనుకూలంగా లేదట.

అందుకే ఫైలట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అందరూ సురక్షితంగానే విమానం నుండి దిగారు.. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఈ ఘటన పట్ల ఆందోళనలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version