రేవంత్ పోలిటికల్ కెరీర్ కే అతిపెద్ద దెబ్బ కొట్టిన సోనియా గాంధీ !

-

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి ఏ ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి ని సపోర్ట్ చేయకపోవడంతో చాలా విమర్శలు వస్తున్నాయి. చాలా దూకుడుగా కాంగ్రెస్ పార్టీలో వ్యవహరించిన రేవంత్ రెడ్డి పై భూ అక్రమాలు అవినీతి కార్యక్రమాలు చేశాడని ఆధారాలతో సహా బయట పడటంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు రేవంత్ రెడ్డి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదు. ఇటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి వర్గీయులు ఎప్పటినుండో తెలంగాణ పీసీసీ పదవి తమ నాయకుడికి వస్తుందని భావిస్తున్న తరుణంలో పీసీసీ పదవికి రేవంత్ రెడ్డి అర్హుడు కాదని తెలంగాణ హైకమాండ్ తేల్చింది. దీంతో ఈ దెబ్బతో రేవంత్ పొలిటికల్ కెరీర్ కే అతి పెద్ద దెబ్బ కొట్టినట్లయింది. అయితే ఈ వ్యవహారం అంతా ఢిల్లీలో ఉన్న సోనియాగాంధీ నేతృత్వంలో జరగటంతో రేవంత్ రెడ్డి మద్దతుదారులు కాంగ్రెస్ హైకమాండ్ పై మండిపడుతున్నారు.

 

పార్టీ కోసం పని చేసిన రేవంత్ రెడ్డి ని ఆయన పనితనాన్ని గుర్తించకుండా ఎందుకు ఈ విధంగా ఒంటరిని చేసి ఆడుకున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version