జేఈఈ, నీట్ పరీక్షలపై సోనియా కీలక సమావేశం..!

-

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణపై కాంగ్రెస్ రాష్ట్రాల సీఎంలతో నేడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. జేఈఈ, నీట్‌తో పాటు జీఎస్టీపైన కూడా సోనియా సమాలోచనలు చేయనున్నారు. కాంగ్రెస్ సీఎంలతో పాటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇకపోతే నీట్, జేఈఈ పరీక్షలపై ఇప్పటికే ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బెర్గ్ సైతం స్పందించారు.

కాగా, జేఈఈ మెయిన్ సెప్టెంబ‌ర్ 1 నుంచి 6 వ‌ర‌కు, నీట్ సెప్టెంబ‌ర్ 13న జ‌ర‌గ‌నుంది. అదేవిధంగా ప్ర‌తిష్టాత్మక విద్యాసంస్థ‌లైన ఐఐటీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ సెప్టెంబర్‌ 27న జ‌ర‌గ‌నుంది. అయితే కరోనా అనుమానితుల‌కు ఐసోలేష‌న్ గ‌దిలో ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాలని ఆయనేకమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version