2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన తిరిగి రెండవ దఫా అధికారాన్ని సొంతం చేసుకుంది అధికార టీఆర్ ఎస్ పార్టీ. అయితే రెండవ సారి తెరాసకు తెలంగాణ శ్రేణుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీని మూలంగా గెలుస్తామని ధీమాని వ్యక్తం చేసిన తెరాస పార్టీ పలు కీలక స్థానాల్లో తమ అభ్యర్థుల ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అలా తెరాస ధీమాను వ్యక్తం చేసిన స్థానాలు చాలానే వున్నాయి. అందులో సికింద్రాబాద్ మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం ఒకటి కాగా రెండవది ఉత్తర తెలంగాణ వరంగల్ జిల్లా సమీపంలోని ములుగు జిల్లా నియోజక వర్గం.
ఇది ఏజెన్సీ ఏరియాకు చెందిన నియోజక వర్గం కావడం, ఇక్కడ పార్టీ ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్‌కు మంచి పట్టు వుండటంతో ఈ సారి కూడా ములుగు నియోజక వర్గంలో గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయం అంటూ గులాబీ శ్రేణులు, గులాబీ దళపతి కేసీఆర్ గట్టి నమ్మకంతో వున్నారు. ఈ నియోసక వర్గంలో తెరాస అభ్యర్థి గెలిస్తే ములుగుని జిల్లాగా మారుస్తానని, అభివృద్ధి చేస్తానని స్వయంగా కేసీర్ వాగ్ధానం చేశారు. అయితే ములుగు నియోజక వర్గ ఓటర్లు కనికరించలేదు. ఉత్యమ నాయకురాలు, మాజీ నక్సలైట్ దనసరి అనసూయ అలియాస్ సీతక్కని గెలిపించి అధికార పార్టీకి షాకిచ్చారు. ఇందుకు ప్రత్యేక కారణాలు లేకపోలేదు. ములుగు నియోజక వర్గ ఇంచార్జ్ అజ్మీరా చందూలాల్.. ఆయన పుత్ర రత్నం హద్దులు మీరి ప్రవర్తించడమే.
అజ్మీరా చందూలాల్‌పై రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ నుంచి టిక్కెట్ సాధించిన సీతక్క విజయభేరి మోగించి మరోసారి ఎమ్మెల్యే అయ్యింది. గడిచిన కొన్ని నెలలుగా ఈ నియోజక వర్గంపై తెరాస అధినాయకత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. క్రమ క్రమంగా నియోజక వర్గంలో సీతక్క ప్రాధాన్యతను తగ్గిస్తూ ఆమె చుట్టూ వున్న లీడర్లని, క్యాడర్‌ని కూడా అధికార పార్టీ దూరం చేస్తూ వస్తోంది. ఎంతలా అంటే నియోజక వర్గం లోని మండలాల్లో సీతక్క పర్యటిస్తే ఆమె వాహనం తప్ప మండలాల్లో మరో వాహనం, మండల క్యాడర్ కనిపించని దుస్థితి ప్రస్తుతం నడుస్తోంది. అన్ని విధాలుగా సీతక్కని ఒంటరిని చేసి రానున్న ఎన్నకల్లో ఓడించాలన్నది తెరాస తాజా ప్యూహంగా కనిపిస్తోంది.
ఇందుకు ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్‌ని పావుగా వాడుతూ తెరాస అధినాయకత్వం ఎత్తలు వేస్తుండటం గమనార్హం. అన్నీ తెలిసి కూడా సీతక్క ఏమీ చేయలేకపోతోంది. దీంతో నియోజక వర్గం అంతటా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. తెరాస ప్యూహాన్ని సీతక్క ఛేధించి మళ్లీ తన ప్రాధాన్యతను చాటుకునే ప్రయత్నం చేస్తుందా? లేక రేవంత్ రెడ్డి కారణంగా తన ప్రాభవాన్ని కోల్పోతుందా ? అన్నది వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.