సోనూసూద్.. లాక్‌డౌన్ సమయంలో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోయింది. వలస కార్మికులను సొంత ప్రాంతాలకు పంపేందుకు సోనూసూద్ తన సొంత ఖర్చులతో వారికి ఏర్పాట్లు చేశాడు. అంతే కాదు ఆ తర్వాత కూడా అనేక మందికి సాయం చేశాడు. తన వద్దకు సాయం కోరి ఎవరు వచ్చినా కాదనకుండా ఆదుకుంటున్నాడు. లాక్‌డౌన్ టైమ్‌లో వినిపించిన ఆయన పేరు… ఇప్పటికీ మారుమోగిపోతూనే ఉంది. అనేక మంది ఆయనను ప్రశంసిస్తూ అనేక రకాలుగా కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాదు సన్మానాలు కూడా చేశారు.
ఈ మధ్య ఓ ఇండియన్ ఫ్లైట్‌పై ఆ సంస్థ సోనూసూద్ బొమ్మ ముద్రించి కృతజ్ఞతలు తెలిపింది. ఇంతటి అరుదైన గౌరవం చాలా తక్కువ మందికి దక్కింది. మరి అంతలా పాపులర్ అయ్యాడు సోనూసూద్. రీల్ విలన్ అయిన సోనూసూద్‌ను ఆయన అభిమానులు రియల్ హీరోగా కొలుస్తారు. ఆపదొచ్చిందంటే అందరికీ గుర్తొచ్చే ఒకేఒక పేరు సోనూసూద్.
ఇక ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారింది. రోజుకు రెండు లక్షల దాకా కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సీజన్ దొరక్క చాలా మంది పేషెంట్లు చనిపోతున్నారు. ఇలాంటి టైమ్ లో అందరికీ మరోసారి సోనూ సూద్ గుర్తొచ్చి సాయం కోసం ఫోన్లు చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో రిక్వెస్టులు పెడుతున్నారు. హాస్పిటల్ బెడ్స్, కరోనా మెడిసిన్, ఇంజెక్షన్ల కోసం దేశ నలుమూలల నుంచి ఆయనకు వేలల్లో ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. ఇక సాయం అందించడానికి తాను ఎప్పుడూ ముందుంటాను చెప్పాడు. తన ఒక్కడి సాయం సరిపోదని, దయచేసి అందరూ కలిసిరండి అంటూ పిలుపునిచ్చాడు. అందరికీ సాయం చేద్దామని కోరుతున్నాడు. మరి మీరూ ముందుకు కదలండి.