రియల్ హీరో సోనూసూద్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

-

హైదరాబాద్: ఇవాళ రియల్ హీరో సోనూసూద్ పుట్టిన రోజు. కరోనా కాలంలో అండగా నిలిచిన సోనూసూద్‌కు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, ప్రజలు బర్తడే విషెస్ చెబుతున్నారు. సినిమాల్లో విలన్‌గా కనిపించే సోనూ సూద్ రియల్ లైఫ్‌లో ఉదారగుణం కలిగినవారు. ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా ఆయన వెంటనే స్పందిస్తారు. వారిని ఆదుకోవడంతో పాటు భరోసా కల్పిస్తారు. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన కోసం నడకయాత్ర చేసి మరీ అభిమానాన్ని చాటుకున్నారు.

అలాంటి రియల్ హీరో సోనూసూద్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన నటుడికి విషెస్ చెప్పాలని ఉవ్విల్లూరుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచే సోనూసూద్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన నిండునూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని దీవిస్తున్నారు. అయితే తన పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా చేయాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని సోనూసూద్ అభిమానులకు సూచించారు.

 

కాగా సోనూసూద్.. పంజాబ్ యోగా పట్టణంలో 1973, జులై 30న శక్తి సాగర్ సూద్, సరోజ్ సూద్‌ దంపతులకు జన్మించారు. నాగపూర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివారు. మహారాష్ట్రలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన మహిళ సోనాలితో వివాహం జరిగింది.. సోనూసూద్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

సోనూసూద్ తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో అరుంధతి మూవీకి ఉత్తమ విలన్ గా నంది అవార్డు వచ్చింది. కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలసకూలీలను సొంత ఖర్చులతో వారి స్వగ్రామాలకు తరలించి వార్తల్లో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version