Acharya: ‘బసవ’గా సోనుసూద్..‘ఆచార్య’లో రియల్ హీరో డిఫరెంట్ లుక్

-

రీల్ పైన విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం యాక్టర్ సోనుసూద్ హీరోనే అని చెప్పొ్చ్చు. కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో ఎంతో మందిని ఆదుకున్న సోనుసూద్..ను ప్రముఖులు అందరూ ప్రశంసించారు. ఇప్పటికీ తన వంతు సాయంగా సొసైటీకి సేవలందిస్తూనే ఉన్నారు సోనుభాయ్.

కలియుగ దైవం సోనుసూద్ అని ఈ సందర్భంగా పలువురు కీర్తించారు. వలస కూలీల కోసం ట్రెయిన్స్ ఏర్పాటు చేసి మరీ సోనుసూద్ వారిని ఇళ్ల కు చేర్చారు. ఈ సంగతులు పక్కనబెడితే..సోనుసూద్ టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ఆచార్య’లో విలన్ రోల్ ప్లే చేశారు.

వెరీ డిఫరెంట్ గెటప్ లో సోనుసూద్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా సోనుసూద్ ట్విట్టర్ వేదికగా ‘ఆచార్య’ పిక్చర్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు. అవి చూసి నెటిజన్లు, సినీ అభిమానులు వాహ్..అంటున్నారు.

పిలకతో సోనుసూద్..అలా ముఖంపైన కుంకుమతో , నుదుటన బొట్టు పెట్టుకుని నయా అవతార్ లో చాలా చక్కగా ఉన్నారు. ఈ నెల 29న ‘ఆచార్య’ సినిమా విడుదల కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version