హైదరాబాద్ లో 144 బస్తీ దవాఖానలను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నామని.. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు.బాలా నగర్‌లో బస్తీ దవాఖానను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 వ ఆర్ధిక సంఘం హైద్రాబాద్ లో ప్రారంభమైన బస్తి దవాఖాన లను మోడల్ గా తీసుకొని దేశవ్యాప్తంగా ఆమలు చేయాలని సూచించిందన్నారు. హైద్రాబాద్ లో బస్తి దవాఖాన్ లో ప్రారంభమైన తరవాత ఇతర జిల్లాలు నుంచి డిమాండ్ వస్తుందని.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని పరీక్షలు చేస్తున్నామన్నారు.
11 లక్షల మందికి ఉచిత పరీక్షలు చేసామని.. రిపోర్ట్స్ నేరుగా మొబైల్ కి వస్తున్నాయని వెల్లడించారు. 4 సూపర్ స్పెషలాటి ఆసుపత్రిని నిర్మించబోతున్నామని.. ఒక్క ఆసుపత్రి వెయ్యే పడకలు ఆసుపత్రి పేర్కొన్నారు. త్వరలో ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంఖుస్టాపన చేయనున్నారని.. ఓమిక్రాన్ అని కొత్త వైరస్ వచ్చింది అని ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదర్కొవడం కోసం అన్ని చర్యలు తీసుకుందని.. కరోనా ఎదుర్కోవడం ప్రజలు చేతులు ఉందని వెల్లడించారు.
వాక్సిన్ వేసుకోవాలి,మాస్క్ పెట్టుకోవాలి,ఫీజీకల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. 2 కోట్ల 51 లక్ష మొదటి టీకా వేసుకున్నారని.. 2 టీకాలు వేసుకోండి, ప్రాణాపాయం ఉండదని తెలిపారు. 80 లక్షలు వాక్సిన్ స్టాక్ ఉందన్నారు. లోకల్ కార్పొరేటర్ ఎన్నికల అప్పుడు ఎలా ఓటు కోసం వెళ్లారు, ఒక్కక్క ఇంటికి వెళ్లి మరీ వాక్సిన్ వేయించాలని తెలిపారు.