గుప్పెడంతమనసు 311 ఎపిసోడ్: మామిడితోటలో రిషీ వసుధారల రొమాన్స్..ఉయ్యాల కడతా అంటూ చెట్టెక్కబోయిన వసూ.!

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ, రిషీ ఆ బంటిగాడ్ని తీసుకుని గోలీలు ఆడే ప్లేస్ కి వెళ్తారు. అక్కడున్న మిగిలిన వాళ్ల దగ్గర కూడా కిరణ్ అనే ఫ్రెండ్ గోలీలు కాళీ చేస్తాడు. వసూధార ఆ కిరణ్ తో గోలీలు ఆట ఆడదాం అంటుంది. రిషీ ఇదంతా అవసరమా అంటే..ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటుంది వసూ. వసూ ఆడటం స్టాట్ చేస్తుంది. మొదట ఆ కిర్రుగాడు ఆడతాడు. వసూ రిషీకి ఆట గురించి వివరిస్తుంది. వసూ వంతు వస్తుంది. వసూ గెలుస్తుంది. వసూ రెండూసార్లు గెలుస్తుంది. వసూ రిషీతో కూడా ఆడిస్తుంది. రిషీ కూడా గెలుస్తాడు. ఆ కిరణ్ గాడి దగ్గర ఉన్న గోలీలు అయిపోతాయి. వసూ ఇక ఆ కిరణ్ కి గీతోపదేశం చేస్తుంది. వసూ అందరికి గోలీలు ఇవ్వమని చెప్తుంది. వసూకి కూడా కొన్ని గోలీలు ఇస్తారు. కారులో వస్తున్న వసూ ఆ గోలీలు చూస్తూ..పిల్లలతో ఆడుకోవటం సరదాగా గడిచింది కదా అని రిషీతో అంటే..అవును నువ్వు వాళ్లలో కలిసిపోవయావ్ కదా అంటే అంతే ఉండాలి సార్..నేనింతే అంటే ఏం బాగుంటుంది సార్ అంటుంది. వసూ సగం గోలీలు రిషీకి కూడా ఇస్తుంది. రిషీ వసూ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా వస్తారు.

మహేంద్ర, ఫణీంద్రవాళ్లు వనభోజనాలకు వస్తారు. జగతి అప్పటికే వచ్చి ఉంటుంది. మినిష్టర్ వైఫ్ వచ్చి దేవయాని వాళ్లను పలకరిస్తుంది. దేవయాని కళ్లన్నీ జగతీపైనే ఉంటాయి.దేవయాని ధరణితో జగతి ఇక్కడకు కూడా వచ్చింది,తనను చూడగానే వొళ్లుమర్చిపోయి ప్రవర్తించకు అంటూ ధరణీని హెచ్చరిస్తుంది. దేవయానిని జగతి దగ్గర కుర్చోమని మహేంద్ర, ఫణీంద్ర వెళ్తారు. దేవయాని జగతీతో ఎంటి మేం ఎక్కడకు వెళ్తే అక్కడకు వస్తున్నావ్, ఆహ్వానం ఉందా నువ్వే వచ్చావా అంటే..జగతి తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంది. ఇక్కడికి మీరు కూడా గెస్ట్ గానే వచ్చారు,మీదీ నాది అన్న ప్రసక్తే లేదు..అడవిలో అన్నిరకాల జంతువులు ఉంటాయి. పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, జిత్తులమారి నక్కలు ఉంటాయి అంటుంది. ఈ అడవి నాది అని ఏ జంతువు అనుకోదు అక్కయ్య, కానీ ఈ ప్రదేశం నాది, నేనే బతకాలి అని మనిషి మాత్రమే అనుకుంటాడు.. ఎంత ఘోరమో కదా అంటే..దేవయాని మాటలు బానే చెప్పావు, నేను ఒక మాట చెప్తాను విను..సింహాలు నుండి జింకలు తప్పించుకోలేవు అంటుంది. జగతి కుర్చోండి అక్కయ్య అంటే..మాకు తెలియదా నువ్వు చెప్పాలా అంటుంది. జగతి..ఎవర్నో పిలిచి డీబీఎస్డీ ఎండీగారి పెద్దమ్మగారు వచ్చారు..కూల్ డ్రింక్స్ తీసుకురండి అంటుంది . నీ పెత్తనం ఏంటి అంటుంది దేవయాని. మర్యాదలో కూడా మీకు పెత్తనం కనబడితే నేను ఏం చేయలేను అక్కయ్య అంటుంది జగతి. దేవయానికి మీ శిష్య పరమాణవు రాలేదా అంటే..వస్తుంది, దారిలో ఉంది అంటుంది జగతి.

మహేంద్ర, ఫణీంద్ర వాళ్లు వేరే దగ్గర కుర్చోని అక్కడున్న వాళ్లతో మాట్లడతా ఉంటారు. మహేంద్ర అక్కడినుంచే జగతికి హాయ్ చెప్తాడు. అది కాస్త దేవయాని చూస్తుంది. జగతి నవ్వుతుంది. ఈ సీన్ భలే ఉంటుంది. దేవయాని మనసులో ఎక్కడికి వెళ్లినా వీళ్లు మాత్రం మారరు అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

తరువాయిభాగంలో వసు చెట్టుకు ఉయ్యాల కడతా అని చెట్టు ఎక్కబోతుంది. కిందపడిపోతుంది. ఎప్పటిలానే..రిషీ పట్టుకుంటాడు. ఒకరిమీద ఒకరు పడతారు. నువ్వు పడిపోతుంటే పట్టుకోవటం నాకు పార్ట్ జాబ్ హా అంటూ కసురుకుంటాడు రిషీ. రేపు ఉయ్యాల కట్టి వీళ్లిద్దరూ ఊగుతారేమో చూడాలి.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version