త్వరలో గౌతమ్ మీనన్ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ రీరిలీజ్

-

నేచురల్ స్టార్ నానీ హీరోగా సమంత హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు.2012 డిసెంబరు 14 న విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టింది. అయితే ఈ మధ్యన టాలీవుడ్ ఇండస్ట్రీలో రిరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.ఈ తరుణంలో ఈ సినిమాను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ అందించగా.. ‘ప్రియతమా.. నీవచట కుశలమా’ సాంగ్ను మ్యూజిక్ లవర్స్ ఇప్పటికీ వింటుంటారు.

తమిళంలో “నీదానే ఎన్ పొన్వసంతం’ గా ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా రూపొందింది. అందులో తమిళ నటుడు జీవా నాని నటించిన వరుణ్ పాత్రను పొషించగా, నిత్య పాత్రను సమంత పొషించింది. ఈ చిత్రం తెలుగులో భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version