దేశవ్యాప్తంగా మరికొన్ని రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఆయా పార్టీలకు ,ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికలలో పోటీ చేసే గుర్తును కేటాయిస్తుంది.ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.అలీగఢ్‌లో లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పండిత్ కేశవ్ దేవ్ కు ఎలక్షన్ కమిషన్ రెండు జతల చెప్పుల గుర్తును కేటాయించింది. దీంతో కేశవ్ చెప్పుల దండను మెడలో ధరించి ప్రచారం చేస్తున్నాడు. తెల్లని తలపాగా.. మెడలో చెప్పుల దండతో ఆయన అలీగఢ్ లోని వీధులన్నీ తిరుగుతున్నాడు.
సమర్థిత్ భ్రష్టాచర వ్యతిరేక సే అనే పేరుతో అవినీతి అంతం చేయడమే లక్ష్యంగా తాను ఎన్నికల బరిలో దిగినట్లు కేశవ్ దేవ్ వెల్లడించారు. తనకు మద్దతుగా నిలవాలని ఫుడ్ స్టాళ్లు, షాప్‌లు, ప్రజల వద్దకు వెళ్లి కోరుతున్నాడు. ఈ నెల 19 నుంచి జూన్ 1 మధ్యలో ఏడు దశల్లో యూపీలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.ఇక, ఈ స్థానంలో 2019లో బీజేపీ నుంచి సతీష్ కుమార్ గౌతమ్ ఏకంగా 6,56,215 ఓట్లు సాధించి గెలిచారు.