పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నిషేధిత చర్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురీందర్ చావ్లా ఆయన పదవికి రాజీనామా చేశారు. సురీందర్ చావ్లా వ్యక్తిగత కారణాల వల్ల మరియు మెరుగైన కెరీర్ అవకాశాలను అన్వేషించడం కోసం ఏప్రిల్ 8, 2024న తన రాజీనామాను సమర్పించారని పేటీఎం సంస్థ యాజమాన్యం వెల్లడించింది.
ఈ ఏడాది జూన్ 26 న వ్యాపార వేళలు ముగిసే వరకు అతను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి రిలీవ్ అవుతాడు. పరస్పర అంగీకారంతో సీఈఓ రాజీనామాను ఆమోదించడం జరిగిందని పేటీఎం పేరెంటిగ్ సంస్థ One97 కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించారు.