వాట్సాప్‌లో వ‌స్తున్న మ‌రొక అద్భుత‌మైన ఫీచ‌ర్‌.. ఏమిటంటే..?

-

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వ‌ర‌లో త‌న యూజ‌ర్ల‌కు మ‌రోకొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తేనుంది. ఎక్స్‌పైరింగ్ మెసేజెస్ పేరిట ఆ ఫీచ‌ర్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తుంది. దీన్నే వాట్సాప్ గ‌తంలో డిస‌ప్పియ‌రింగ్ మెసేజెస్ ఫీచ‌ర్ అని వ్య‌వ‌హ‌రించేది. కానీ ఎక్స్‌పైరింగ్ మెసేజెస్ పేరిట ఆ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తేనుంది. ఇక ఈ ఫీచ‌ర్‌ను వాట్సాప్ ఇప్ప‌టికే అంత‌ర్గ‌తంగా ప‌రిశీలిస్తోంది.

వాట్సాప్‌లో పంపే మెసేజ్‌లు కొంత నిర్దిష్ట‌మైన స‌మయం త‌రువాత వాటిక‌వే ఆటోమేటిగ్గా అదృశ్య‌మ‌య్యేలా ఫీచ‌ర్‌ను తెస్తున్నార‌ని ఎప్ప‌టినుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే వాటిని వాట్సాప్ త్వ‌ర‌లో నిజం చేయ‌నుంది. ఎందుకంటే ఆ ఫీచ‌ర్‌ను ప్ర‌స్తుతం బీటా యాప్‌లో ప‌రీక్షిస్తున్నారు. అందువ‌ల్ల ఆ ఫీచ‌ర్ అతి త్వ‌ర‌లోనే యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌స్తుంది.

ఇక వాట్సాప్‌లో యూజ‌ర్ పంపే మెసేజ్ ఎంత సేప‌టి త‌రువాత అదృశ్యం అవ్వాలో సెట్ చేసుకునే స‌దుపాయాన్ని కూడా క‌ల్పిస్తారు. ఒక రోజు, ఒక వారం లేదా ఒక నెల‌.. ఇలా యూజ‌ర్ త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఆ స‌దుపాయాన్ని సెట్ చేసుకోవ‌చ్చు. దీంతో ఆ యూజ‌ర్ పంపే మెసేజ్‌లు ఆ స‌మ‌యం త‌రువాత వాటిక‌వే అదృశ్య‌మ‌వుతాయి. అయితే గ్రూప్‌ల‌లో పంపే మెసేజ్‌ల‌కు మాత్రం అడ్మిన్ ముందుగా సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఫీచ‌ర్ అతి త్వ‌ర‌లోనే వాట్సాప్ యూజ‌ర్ల‌కు ల‌భ్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version