సూప్: రోగనిరోధకశక్తిని పెంచే పెసల గింజల సూప్ ప్రయత్నించారా?

-

మహమ్మారి కారణంగా ప్రతీ ఒక్కరికీ రోగనిరోధక శక్తి గురించి తెలిసింది. అది ఎందుకు పెంచుకోవాలో ఎలా పెంచుకోవాలో కూడా తెలుసుకున్నారు? రోగనిరోధక శక్తి ఒక రోజులో లేదా రెండు రోజుల్లో పెరగదని కూడా తెలుసుకున్నారు. కానీ మీకీవిషయం తెలుసా? పప్పు ధాన్యాల్లోని పెసల గింజలతో చేసిన సూప్ తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అవును, దానిలోని పోషకాలు కరోనా నుండి రికవరీ అయిన వాళ్ళకి గానీ, కరోనాతో పోరాడుతున్న వారికి గానీ, కరోనా రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని చూసేవారికి గానీ చాలా అవసరం.

అంతేకాదు డీహైడ్రేషన్ తో బాధపడేవారికి ఇది సంజీవనిలా పనిచేస్తుంది. ఫ్లూ తో ఇబ్బందిపడుతుంటే చక్కగా పనిచేస్తుంది. ఆయుర్వేద నిపుణులు ఇది శరీరానికి మంచి పోషణ అందిస్తుందని చెబుతున్నారు.

పెసర పప్పుతో చేసిన సూప్ ఎందుకు తీసుకోవాలంటే,

చాలా సులభంగా జీర్ణం అవుతుంది.
అధిక ప్రోటిన్ ఉన్నప్పటికీ జీర్ణాశయం మీద ఎలాంటి భారం పడదు.
అంతే కాదు మీకు కరోనా పాజిటివ్ వచ్చినట్టయితే మొదటి వారంలో ఫ్లూ వంటి లక్షణాలు ఉన్నట్లయితే చాలా త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవడం మంచిది. అందులో పెసర పప్పు సూప్ ఉంటే బాగుంటుంది.

సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

పావు కప్పు- పెసర పప్పు
2కప్పుల – నీళ్ళు
1టేబుల్ స్పూన్- నెయ్యి
1/2టేబుల్ స్పూన్- జీలకర్ర

1/2టేబుల్ స్పూన్ తురిమిన అల్లం
అరకప్పు- క్యారెట్, గుమ్మడికాయ ముక్కలు
పావుకప్పు- మిరియాలు
చిటికెడు అల్లం పొడి
చిటికెడు వాము
కొద్దిగా ఉప్పు
కొద్దిగా మెంతి

పద్దతి

ముందుగా పావుకప్పు పెసరపప్పుని అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత అందులోని నీటిని తీసివేయాలి.

కుక్కర్ లో నెయ్యిని తీసుకుని వేడి చేయాలి. దానిలో జీలకర్ర, తురిమిన అల్లం వేసుకోవాలి.

ఆ తర్వాత పెసరపప్పుని ఉడికించాలి.

క్యారెట్, గుమ్మడి ముక్కలని అందులో కలుపుకోవాలి.

నీళ్ళని అందులో కలుపుకు చిన్న మంట పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఆగాలి.

వండడం పూర్తయిన తర్వాత దానికి కొద్దిగా వాము, ఉప్పు, అల్లం పొడి కలుపుకోవాలి. చెంచాతో పూర్తిగా కలిపి ఆ తర్వాత మెంతి దాని మీద యాడ్ చేయాలి.

అంతే, వేడి వేడిగా సేవించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version