ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుండి టీం ఇండియా తర్వాతి వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ ఎవరు అనే చర్చ గతంలో ఎన్నడూ లేని విధంగా ఊపందుకుంది. రిషబ్ పంత్ ముందు వరుసలో ఉన్నా సరే అతనిలో నిలకడ లేదు. ఇటీవల జరిగిన ఐపిఎల్ లో సంజు సామ్సన్ తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడు గంగూలి కీలక వ్యాఖ్యలు చేసారు.
పంత్ మరియు వృద్దిమాన్ సాహ దేశంలో మా ఇద్దరు ఉత్తమ వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ అని గంగూలీ అన్నాడు. పంత్ బ్యాటింగ్ ఐపిఎల్ లో ఆకట్టుకోలేదు అని అనగా… అతను చాలా ప్రతిభ ఉన్న ఆటగాడు అని, అతని బ్యాటింగ్ తిరిగి మళ్ళీ వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేసాడు. “అతను ఒక యువకుడు మరియు మనమందరం అతనికి మార్గనిర్దేశం చేయాలి. అతనికి అద్భుతమైన ప్రతిభ ఉంది.” అని చెప్పాడు.